
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు న్యూఢిల్లీ లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ప్రభుత్వాధినేతగా 25 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకే ప్రయోజనం చేకూర్చే “Next Gen GST” సంస్కరణలను ప్రధాని మోదీ నాయకత్వంలో అమలు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కర్నూలులో నిర్వహించనున్న ‘ సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ ’ సభకు రావాలని ప్రధానిని ఆహ్వానించారు.