స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అనేది తీవ్రమైన సమస్య అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఎస్ఐఆర్ను ప్రజాస్వామ్య హక్కులను పరిమితం చేయడానికి పక్కా ప్రణాళికతో తీసుకొచ్చిన కుట్రగా అభివర్ణించారు. పేద, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల ఓట్లను ఓటరు జాబితా నుంచి తొలగించకుండా చూసుకోవడానికి ఇంటింటిని సందర్శించాలని కాంగ్రెస్ నేతలను కోరారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో మల్లికార్జున ఖర్గే ఈ మేరకు వ్యాఖ్యానించారు.

