ప్రకాష్ రాజ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఇది అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదని.. కశ్మీర్‌పై జరిగిన దాడి అని అన్నారు. ‘ఏప్రిల్ 22, 2025 పర్వతాలు సైతం మోయలేనంత నిశ్శబ్ధం ఆవరించిన రోజు. ప్రశాంత ప్రకృతి వాతావరణంలో అలరారుతున్న ప్రదేశంలో నెత్తురు చిందిన రోజు. ప్రతీ కశ్మీరీ గుండె పగిలింది. క్రూరమైన ఈ చర్యను చెప్పడానికి మాటలు కూడా రావడం లేదు. ఈ ఆటవిక దాడి అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదు. కశ్మీర్‌పై దాడి.’అని అన్నారు.

