అంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో గత కొద్ది రోజులుగా ప్రజలకు భయభాంతులకు గురి చేస్తున్న పెద్దపులిని కూర్మాపురంలో అటవీ శాఖ అధికారులు బంధించారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చి దాన్ని పట్టుకున్నారు. పులిని పట్టుకోవడానికి పూణెకు చెందిన ఓ ప్రత్యేక బృందం రంగంలోకి దిగినట్లు అధికారులు తెలిపారు. ఐదు గంటలపాటు ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ చేసి పులిని పట్టుకున్నారు.

