
ఆల్ ఇండియా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS)లో కార్డియో థోరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ శాఖ అధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ ఏకే బిసోయిని సస్పెండ్ చేశారు. తనను వేధిస్తున్నట్లు ఓ మహిళా నర్సింగ్ ఆఫీసర్ ఫిర్యాదు చేయడంతో ఈ చర్య తీసుకున్నారు. ఎయిమ్స్‌కు చెందిన నర్సుల సంఘం .. పీఎంవోకు పదేపదే ఫిర్యాదులు చేయడంతో ఈ చర్యకు పాల్పడ్డారు. లైంగికంగా వేస్తున్నాడని, నీచమైన భాషను వాడుతున్నాడని, పని ప్రదేశంలో బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కార్డియో అధిపతిపై నర్సులు ఫిర్యాదు చేశారు.