తాము పాలకులం కాదు సేవకులమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తమకు సేవ చేయడానికే ప్రజలు అవకాశం ఇచ్చారని తెలిపారు. పాలకుడిగా తాను ఎప్పుడూ ప్రవర్తించలేదని, సేవకుడిగా మాత్రమే వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. నేనే రాజు నేనే మంత్రి వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. గెలుపు ఓటమి అన్నింటికీ తానే బాధ్యత తీసుకుంటానని చెప్పానన్నారు. అచ్చంపేట అడవుల్లో 20 ఎకరాల్లో సంత్ సేవాలాల్ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

