హిస్టరీ రిపీట్ అయింది. పాకిస్తాన్ జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించింది. టీ20 ప్రపంచ కప్ లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచులో సూర్యకుమార్ సేన పరుగుల తేడాతో పాక్ జట్టును చిత్తు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. ఛేజింగ్ కు దిగిన పాక్ జట్టు ఏ దశలోనూ రాణించలేదు. 18 ఓవర్లలో 114 పరుగులకు పాక్ ఆలౌట్ అయింది. కీపర్ ఉస్మాన్ ఖాన్ చేసిన 44 పరుగులే అత్యధిక స్కోరు

