పాకిస్థాన్‌తో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 27వ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేశారు. భారత్- పాకిస్థాన్ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో యువరాజ్ కంటే వేగంగా ఫిఫ్టీ సాధించిన బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నిలిచాడు. ఇషాన్ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయగా, యువరాజ్ సింగ్ 2012లో పాకిస్థాన్‌పై టీ20 మ్యాచ్‌లో 29 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు.

