పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న వేళ.. ఐరాసలోని 15 మందితో కూడిన బృందం సాయంత్రం నాలుగు గంటలకు న్యూయార్క్‌లో అత్యవసరంగా భేటీ అవ్వనుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 2 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. ఇరాన్‌పై ఇజ్రాయేల్, అమెరికా సంయుక్తంగా చేపట్టిన సైనిక దాడులను ఖండిస్తూ.. రష్యా, చైనా, ఫ్రాన్స్, బహ్రెయిన్, కొలంబియా దేశాలు ఐరాస అత్యవసర భేటీని కోరాయి. ఈ సమావేశానికి బ్రిటన్ అధ్యక్షత వహించనుంది.

