
ఇంటి స్థల సమస్య, ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. ఈరోజు కేటీఆర్‌ను మొగులయ్య కలిశారు. ఈ సందర్భంగా
తన సమస్యను మాజీ మంత్రికి వివరించారు మొగులయ్య. తాను కట్టుకున్న ఇంటి గోడలను కబ్జాదారులు కూల్చి వేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మొగులయ్య ఆరోగ్యం, యోగక్షేమాల గురించి కేటీఆర్ ఆరా తీశారు. కంటి చికిత్స చేయిస్తానంటూ హామీ ఇచ్చారు.