జాతీయ విజ్ఞాన దినోత్సవము ను భారతదేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 న జరుపుకుంటారు. రామన్ ఎఫెక్ట్‌ను కనిపెట్టిన చంద్రశేఖర వేంకట రామన్ 28-02-1928న తన పరిశోధనా ఫలితాన్ని ధృవపరచుకున్నాడు. ఆయన ఈ పరిశోధన ఫలితాన్ని ధృవపరిచిన ఈ రోజును (ఫిబ్రవరి 28) నేషనల్ సైన్స్ డే గా జరుపుకుంటున్నారు.