ఎఐ సదస్సులో కాంగ్రెస్ తీరు ఆవవేదన కలిగించిందని, కాంగ్రెస్ తీరు దేశానికి మంచిది కాదని సూచించారు. కొందరు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇప్పుడు కూడా లడ్డూ కల్తీ చేసి హెరిటేజ్ పేరు తీసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. తాను ప్రాణం పోయినా తప్పు చేయనని, లడ్డూ ప్రసాదానికి వాడింది నెయ్యే కాదని సిట్ చెప్పిందని తెలిపారు. తప్పును పక్కన వాళ్లపై నెట్టే నీచులు కూడా ఉన్నారని, నేరగాళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలని చంద్రబాబు నాయుడు హితవు పలికారు.

