మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోవడంతో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు వింత పోకడలకు వెళ్తున్నారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి ఎం.జ్యోతి ఓడిపోయారు. దీంతో
ఎన్నికల ముందు తాను ఇచ్చిన డబ్బులు, చీరలు తిరిగి ఇవ్వాలని కుటుంబసభ్యులతో కలిసి ఇంటింటికీ తిరిగి వసూలు చేస్తున్నారు. జ్యోతి తీరుపై స్థానిక ఓటర్లు మండిపడుతున్నారు. అసలు చీరలు ఎవరు ఇవ్వమన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

