రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా ఒక్క కొత్త పాలసీని కూడా తీసుకురాలేదని విమర్శించారు. నన్ను దూషించడం, నేను చనిపోవాలని శాపాలు పెట్టడమే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమని ధ్వజమెత్తారు. పార్టీని గెలిపించడం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు .అధికార పార్టీకి ఉన్న ప్రజా వ్యతిరేకత ఈ ఎన్నికల ఫలితాల్లో కనిపించిందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు.

