ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగనీటి ప్రాజెక్టుల సమీక్షకు విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెండో రోజు నాగర్‌కర్నూల్ పిఆర్ఎల్ఎస్ పంప్‌హౌస్‌ను పరిశీలించారు. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ ప్యకేజీ-2, ప్యాకేజీ-3 కాలువల నిర్మాణ పనుల పురోగతిని ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, పాలమూరు ప్రాంతానికి సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. పనుల నాణ్యత విషయంలో రాజీపడొద్దని, వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

