అమెరికా అంతరిక్ష సంస్థ నాసా “అథీనా” అనే కొత్త సూపర్ కంప్యూటర్ను ప్రవేశపెట్టింది. ఇది కొత్త తరం మిషన్లు, పరిశోధనా ప్రాజెక్టుల కోసం రూపొందించిన అధునాతన వ్యవస్థ. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే అథీనా అనేది ఒక పెటాస్కేల్ సూపర్ కంప్యూటర్. నాసా ఇప్పటివరకు రూపొందించిన తన అత్యంత శక్తివంతమైన సూపర్‌కంప్యూటర్ ఇదేనని చెబుతోంది. ఇది నాసా హై-ఎండ్ కంప్యూటింగ్ కేపబిలిటీ ప్రాజెక్ట్‌లో భాగం. శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు స్పేస్, ఏరోనాటిక్స్ అండ్ సైన్స్‌లోని కొన్ని సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.

