రష్యాలో ప్రముఖ ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీని విషమిచ్చి చంపేశారని ఐదు యూరోపియన్ దేశాలు పేర్కొన్నాయి. ఆయనకు అత్యంత ప్రమాదకర ప్రాణాంతక టాక్సిన్ శరీరంలోకి పంపించారని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్
విదేశాంగ మంత్రులు ఆరోపించారు. నవన్లీ మృతదేహం అవశేషాల నమూనాలను విశ్లేషించగా ఆయనకు దక్షిణ అమెరికాలో దొరికే టాక్సిన్ ఎక్కించినట్లు వెల్లడైందని,ఈ దారుణ చర్యకు దిగింది రష్యా ప్రభుత్వమే అని ఈ నేతలు తమ ప్రకటనలో తెలిపారు.

