మున్సిపల్ ఎన్నికల వేళ మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపాలిటీలోని 15వ వార్డులో బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు గల్లాలు పట్టుకుని కొట్టుకున్నారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టి, అక్కడి నుంచి పంపించేశారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు దాడులు చేసుకోవడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

