
చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ తనపై దాడి జరిగిన వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. ఫిబ్రవరి 7న పలువురు తమ ఇంటికి వచ్చి తలుపులు తట్టారని తలుపులు తోసుకుని ఇంట్లోకి ప్రవేశించారు. వాళ్లు 20 మందికి పైగా ఉన్నారు. వారు నన్ను కాళ్లు పట్టి లాగి కిందపడేశారు. నా తల గోడకు తగిలింది. ఈ ఘటనతో నేను షాక్‌కు గురయ్యానన్నారు. అక్కడ కూర్చీ లాక్కొని… దాని మీద ఒకాయన కూర్చున్నారు.నిందితులు వారి తర్వాత టార్గెట్ చిన్నజీయరు స్వామి అంటూ బెదిరిస్తూ వెళ్లిపోయారని రంగరాజన్ తెలిపారు.