
ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష త్రయోదశి రోజున జరుపుకునే ఈ పర్వదినాన్ని ధన్ తేరస్ (Dhanteras 2025) అని కూడా పిలుస్తారు. ఈరోజున లక్ష్మీదేవి, కుబేరుడు, ధన్వంతరి భగవానుడిని పూజించడం వల్ల సకల సంపదలు, ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలుగుతాయని నమ్మకం. దీపావళి పండుగ కేవలం ఒక్క రోజు వేడుక కాదు ఐదు రోజుల పాటు సాగే ఉత్సవం. ఈ ఉత్సవాలకు ధన త్రయోదశి నాంది పలుకుతుంది.