వారానికి ఒకసారి మండలానికి, గ్రామానికి స్వచ్ఛ రథం వస్తుందని సిఎం చంద్రబాబు తెలిపారు. పాత వస్తువులు ఇస్తే బదులుగా నిత్యావసరాలు ఇస్తారని అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రజలకు స్వచ్ఛమైన నీరు, గాలి ఇవ్వాలన్నదే తమ ఉద్దేశం అని.. అందుకే ప్రతి మూడో శనివారం స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్రలో పాల్గొంటానని అన్నారు. దేశానికి, రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తున్నారో ప్రజలు గమనించాలని, దేశానికి ఎంతో మేలు చేసే కార్యక్రమాలకు అండగా నిలవాలని కోరారు.

