దేవాదుల పనులపై సీఎం రేవంత్ రెడ్డి గడువు విధించారు. జూన్ 2 లోపు భూసేకరణ పూర్తికి ఆదేశించారు. దేవాదుల ఎత్తిపోతల పథకంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారకూడదని, రైతుల ప్రయోజనాలే పరమావధిగా పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టులో నిలిచిపోయిన పంప్‌లకు నెల రోజుల్లోపు మరమ్మతులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు.

