దుర్గం చెరువు ఆక్రమించడంపై బిఆర్ఎస్ ఎంఎల్ఎ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. దుర్గం చెరువులో తాము ఐదు ఎకరాల భూమి కబ్జా చేశానని కేసు పెట్టారని, అందులో మాకు గజం జాగా కూడా లేదని, ప్రభుత్వానికి కూడా గజం జాగా లేదన్నారు. తనపై కక్షతో కేసు పెట్టారని, బాలకృష్ణ, లహరి ఎస్టేట్ హరిబాబు భూములు పక్కనే ఉన్నాయని వివరించారు. దుర్గం చెరువులో తనకు . భూమి లేదని, ప్రభుత్వ భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు.

