మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా దుబాయ్లో చిక్కుకుపోయిన భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు ఎట్టకేలకు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం ఆమె బెంగళూరు ఎయిర్ పోర్టులో దిగారు. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న స్థితి నుంచి క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో సింధు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, తనను కాపాడిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

