ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ కూడా క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా వైమానిక స్థావరాలున్న పలు గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో దుబాయ్ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా భవనాన్ని ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఖాళీ చేయిస్తున్నారు. ఇరాన్ నుంచి క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో ఈ భవనంలోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. దుబాయ్‌లో కూడా బాంబుల శబ్దాలు వినిపించినట్టు వార్తలు వస్తున్నాయి

