దుబాయ్ విమానాశ్రయం మూసివేతతో పర్యాటకం, వ్యాపారాలు, ఉన్నత విద్య, వైద్యం కోసం వెళ్లిన వారిలో సుమారు 24.4వేలకు పైగా భారతీయులు అక్కడే చిక్కుకుపోయారు. అలా చిక్కుకుపోయిన వారిలో సుమారు 2వేల మంది హైదరాబాదీయులే ఉన్నట్లు ట్రావెల్ ఏజెన్సీలు పేర్కొంటు న్నాయి. సోమవారం రాత్రి దుబాయ్ ఎయిర్‌పోర్టును పునరుద్ధరించారు. భారత్‌కు వెళ్లే చైన్నె, బెంగళూరు, ఢిల్లీ, ముంబై విమానాలు టేకాఫ్ అయ్యాయి. హైదరాబాద్ ప్రయాణికుల కోసం ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ బోర్డింగ్ పాసులు ఇచ్చినా ఫ్లైట్‌ను రద్దు చేసింది.

