
సింగరేణి కార్మికులకు ప్రభుత్వం దీపావళి బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బోనస్ డబ్బులు రూ.1.03 లక్షలు శుక్రవారం (అక్టోబర్ 17) ఉద్యోగుల ఖాతాల్లో జమ అయ్యాయి. దసరా కానుకగా కూడా పెద్ద మొత్తంలో కార్మికులు ఆర్థిక ప్రయోజనం పొందారు. ఈ దీపావళి బోనస్‌తో వారి ఆనందం రెట్టింపు అయింది, సంస్థ లాభాల్లో వాటాను కార్మికులకు కూడా పంచుతున్నారు. గత కొన్ని సవంత్సరాలుగా సింగరేణి సంస్థ రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జిస్తోంది. దీంతో కార్మికులు కూడా అదే స్థాయిలో ప్రయోజనాలు పొందుతున్నారు