దిల్లీలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా విపక్ష ఇండీ కూటమి ఎంపీలు మరోసారి ఆందోళన చేపట్టారు. మొదట ఓ హోటల్‌లో సమావేశమైన నేతలు తర్వాత బస్సులో ఎన్నికల సంఘం కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. “మంగళవారం ఈసీని కలుద్దామని 300 మంది ఎంపీలం వెళ్లాం. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు ఈసీని కలవాలనుకున్నాం. జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకు దిగుతాం. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌కు పదవిలో కొనసాగే అర్హత లేదు.” అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు.