
‘కోల్డ్రిఫ్’ దగ్గు మందును తయారు చేస్తున్న తమిళనాడులోని శ్రీసన్ ఫార్మా సంస్థపై దర్యాప్తు వేగవంతమైంది. చెన్నైలో శ్రీసన్ ఫార్మాకు సంబంధమున్న ఏడు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు చేపట్టింది. మనీలాండరింగ్ చట్టంకింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు. మరణాలకు తమిళనాడు అధికారుల నిర్లక్ష్యమే కారణమని వెల్లడించారు. ఈ కంపెనీని వారు ఇప్పటివరకు ఒక్కసారి కూడా తనిఖీ చేయలేదన్నారు. దర్యాప్తులో భాగంగా కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ పలు వైఫల్యాలను గుర్తించినట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి.