తమిళగ వెట్రి కజగం అధినేత విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం పెను దుమారం రేపుతున్నాయి. విజయ్ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ, విజయ్ ముందు తన ఇల్లు దాటి బయటకు రావాలని, నటి త్రిషతో ఉన్న అనుబంధం నుంచి బయటపడితేనే ఆయనకు రాజకీయ వాస్తవాలు తెలుస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చే ముందు తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలని సూచించారు.

