పాలమూరు జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్‌ఎస్ అధినేత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల నుంచి మౌనంగా ఉన్నానని.. ఇక తప్పనిసరి పరిస్థితి అని బయల్దేరానని తెలిపారు. అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతానని పేర్కొన్నారు. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో గ్రామగ్రామాన ప్రజా ఉద్యమాలు చేస్తాం.. బహిరంగ సభలు పెడతామని తెలిపారు. వాటికి తానే స్వయంగా హాజరవుతానని తెలిపారు. ప్రజాక్షేత్రంలో నిష్క్రియ ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. ఇవాల్టి దాకా వేరు కథ.. రేపట్నుంచి వేరే.. తోలుతీస్తామని హెచ్చరించారు.

