బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఛైర్మన్ తారిఖ్ రెహ్మాన్ తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. ఇప్పుడు మనమంతా స్వేచ్ఛను పొందామని, హక్కులకు అసలైన అర్థాన్ని తిరిగి సంపాదించుకున్నామని ఆయన పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వారందరికీ ఈ విజయన్ని అంకితమిస్తున్నామని అన్నారు.కాగా, భారత్, చైనా వంటి దేశాలతో సంబంధాలలో సమతుల్యత పాటిస్తామని తారిఖ్ రెహ్మాన్ గతంలో అన్నారు.

