తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం ఒక్కసారిగా పెరిగింది. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదు కావచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా కర్నూలు వంటి ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఒకవైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు అల్లూరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అసాధారణంగా పొగమంచు కురుస్తోంది. పగలు ఎండ, తెల్లవారుజామున మంచు కురవడం వల్ల వాతావరణంలో అనిశ్చితి నెలకొంది.

