తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అభిషేక్ మనుసింఘ్వీ, కేఆర్ సురేష్ రెడ్డి పదవీ కాలం ముగియడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అభిషేక్ మనుసింఘ్వీకి పార్టీ అధిష్టానం మరో అవకాశం ఇచ్చింది. పైగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన కేసులను అటు సుప్రీంకోర్టు ఇటు తెలంగాణ హైకోర్టులో కూడా ఆయనే వాదిస్తున్నారు ఇక రెండో స్థానం కోసం తెలంగాణ నుంచి రాజ్యసభకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేంద్ రెడ్డిని ఎంపిక చేసింది కాంగ్రెస్ పార్టీ.

