బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నేడు తెలంగాణలో పర్యటిస్తున్నారు. నితిన్ నబిన్ బుధవారం మధ్యాహ్నం 1 గంటలకు హైదరాబాద్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా మహబూబ్‌నగర్‌కు వెళ్లారు. అక్కడ నిర్వహించే బూత్ సమ్మేళనంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. ఇది ప్రజా సభ కాదని, సమావేశం అనంతరం ఆయన నేరుగా ఢిల్లీకి తిరిగి వెళ్తారని రామచందర్ రావు తెలిపారు.

