GOAT లియోనెల్ మెస్సీ, అలాగే ఫుట్‌బాల్ దిగ్గజాలైన లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ మా ఆహ్వానాన్ని మన్నించి హైదరాబాద్‌కు విచ్చేసి, క్రీడాభిమానులను, ముఖ్యంగా యువతను ఉర్రూతలూగించినందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. జీవితకాలం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మార్చినందుకు, మా లీడర్ రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. మా ప్రభుత్వం తరఫున, మా అతిథులకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో అద్భుతంగా వ్యవహరించిన, క్రమశిక్షణను కనబరచిన క్రీడాభిమానులు, అభిమానులందరికీ ధన్యవాదాలు’ అని రేవంత్ రెడ్డి ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

