ఆసుపత్రిలో చేరిన రోగి ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వెళ్లినట్లే, కోర్టుమెట్లు ఎక్కిన కక్షిదారు న్యాయంతో తిరిగి వెళ్లాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో కోర్టు భవనాల సముదాయనికి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థానప చేశారు. తిరుపతి రూరల్‌లోని దామినీడు వద్ద 16 కోర్టు భవనాల సముదాయ నిర్మాణానికి ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.

