తాతల కాలం నుంచి వచ్చే ఆస్తులు మరియు వాటిపై కుటుంబ సభ్యుల హక్కుల గురించి సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన మరియు సంచలన తీర్పును వెలువరించింది. తాత నుండి తండ్రికి సంక్రమించిన భూమి లేదా ఆస్తిపై మనవడికి జన్మతః ఎటువంటి హక్కు ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాత ఆస్తిని వారసత్వంగా పొందిన తండ్రికి ఆ వాటా పూర్తిగా ఆయన వ్యక్తిగత ఆస్తి కిందకే వస్తుందని న్యాయస్థానం తేల్చిచెప్పింది. తాత నుంచి వచ్చిన భూమిని సొంత తండ్రి అమ్మేశారని, ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు.

