పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరం అవుతుండడంతో అంతర్జాతీయ విమానసర్వీసుల ఆపరేషన్‌కు అవాంతరాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీ విమానాశ్రయంలో 80 అంతర్జాతీయ విమానసర్వీసులు రద్దయ్యాయి. 36 సర్వీసులు బయల్దేరవలసినవి కాగా, 44 సర్వీసులు రావలసినవని అధికారులు వెల్లడించారు. ఎమిరేట్స్ ఫ్లైట్ ఇకె 513 దుబాయ్‌కు వెళ్లవలసి ఉన్నప్పటికీ ఎయిర్‌స్పేస్ అవాంతరాల వల్ల తిరిగి న్యూఢిల్లీకి చేరుకుంది. మంగళవారం దుబాయ్ నుంచి డిల్లీకి 149 మంది ప్రయాణికులను ఎయిర్ ఇండియా సర్వీస్ తీసుకొచ్చింది.

