మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్లో రికార్డు స్కోర్ కొట్టినా ఢిల్లీ క్యాపిటల్స్ కల సాకారమవ్వలేదు. తొలి కప్‌ను ఒడిసిపట్టాలని భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉఫ్‌మనిపించింది. జార్జియా వోల్(79), కెప్టెన్ స్మృతి మంధాన(87)లు వీరవిహారం చేశారు. పసలేని ఢిల్లీ బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ బౌండరీల మోతతో చెలరేగారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 165 పరుగుల జోడించి.. ఆర్సీబీని గెలుపు దిశగా నడిపారు.

