
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ పాలనాతీరుపై ప్రపంచ దేశాలతోపాటు స్థానికంగానూ తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ట్రంప్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ గతంలో ‘నో కింగ్స్’ నిరసనలు చేపట్టిన అమెరికన్లు, ఇప్పుడు మరోసారి దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. 50 రాష్ట్రాల్లో దాదాపు 2500లకుపైగా ప్రదేశాల్లో నిరసనలకు చేపట్టనుండగా, పలు ఐరోపా దేశాల్లో వీరికి మద్దతుగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. అమెరికాలో రాజులు లేరని, అవినీతి క్రూరత్వానికి వ్యతిరేక పోరాటంలో వెనక్కి తగ్గమంటూ ప్రత్యేక వెబ్‌సైట్‌లో నిరసనల నిర్వాహకులు పేర్కొన్నారు.