వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పింది. డివైడర్ పైనుంచి దూకి పక్క లేన్‌లోకి దూసుకెళ్లింది. ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. కారులో ఉన్న ఐదుగురు యువకులు ఈ ప్రమాదంలో మరణించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. రాత్రి వేళ వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పింది. రోడ్డు డివైడర్ పైనుంచి జంప్ చేసింది. మరో లేన్‌లోకి దూసుకెళ్లింది. కర్ణాటక ఆర్టీసీ బస్సును ఆ కారు ఢీకొట్టింది. దీంతో ఆ కారు నుజ్జునుజ్జు అయ్యింది. అందులో ఉన్న ఐదుగురు యువకులు ఈ ప్రమాదంలో మరణించారు.

