హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో, వడగాల్పుల ప్రభావం అత్యవసరమైతే తప్ప పగటి సమయంలో ప్రజలు బయట తిరగవద్దు మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ రానున్న 3 రోజులపాటు తీవ్రమైన వడగాల్పులు, ఉక్కపోత ఉంటుందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో తీవ్రమైన ఉక్కపోత, ఎండలు, వడగాల్పులు ఉండనున్న నేపథ్యంలో ఆయా జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

