సౌతాఫ్రికాతో జరుగుతున్న మహిళా వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 298 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ సూపర్బ్ ఫిఫ్టీ (78 బంతుల్లో 87, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచింది. మహిళా వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఒక జట్టు ఛేజ్ చేసిన అత్యధిక స్కోరు కేవలం 167 పరుగులే కావడం విశేషం.

