తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలో అట్టహాసంగా జరిగింది. ఎన్టీఆర్ జయంతి వేడుకలు, పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నికతో సందడి నెలకొంది. అయితే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మహానాడుకు హాజరు కాలేదు. దీంతో ఆయన ఎందుకు రాలేదనే చర్చ జరుగుతోంది. బాలయ్య రాకపోవడంపై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ అఖండ 2 మూవీ షూటింగ్ కోసం జార్జియా వెళ్లారని.. అక్కడ బిజీ షెడ్యూల్ కారణంగానే మహానాడుకు దూరంగా ఉన్నారని చెబుతున్నారు.

