ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని వైసీపీ మాజీ మంత్రి ఆర్‌కె రోజా డిమాండ్ చేశారు. టీటీడీ పదవికి నాయుడు అనర్హుడని ఆరోపించారు. దేశంలో ఏ ఆలయ చైర్మన్‌కు సంబంధించిన వీడియోలు ఇలా బయపటడిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. బీఆర్ నాయుడికి మహిళలంటే గౌరవం లేదని వెల్లడించారు. నిజం ఉంటేనే ఇందు అనే మహిళ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు, మంత్రి నారా లోకేష్‌కు లేఖ ఎందుకు రాస్తుందని అన్నారు.

