రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసిపి అబద్ధాలు చెబుతోందని ఎపి మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే మాజీ మంత్రి వైసిపి జగన్ మోహన్ రెడ్డి ఏం చేశారని..ఈ ఐదేళ్లు వైసిపి నాయకులు
ఏం చేస్తున్నారు..? అని ప్రశ్నించారు. ఎపి శాసనమండలిలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై టిడిపి, వైసిపి సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. 2020 లోనే రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ పనులు నిలిపి వేశారని విమర్శించారు. అప్పుడు జగన్ సిఎంగా ఉన్న విషయం వైసిపి సభ్యులకు తెలియదా? అని నిమ్మల ప్రశ్నించారు.

