డీప్‌ఫేక్ బారిన సినీ మెగాస్టార్ చిరంజీవి కూడా పడటం కలకలం రేపుతోంది.తాజాగా దుండగులు మెగాస్టార్ చిరంజీవి ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలుగా రూపొందించి, వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు మరియు వెబ్సైట్లలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలు కొద్ది గంటల్లోనే వైరల్ అయ్యాయి. విషయం తెలిసిన చిరంజీవి వెంటనే హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం కోర్టును కూడా ఆశ్రయించగా, న్యాయస్థానం
ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

