కేబినెట్ అజెండా అంశాలు ముగిశాక తాజా పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం చేస్తున్న కృషి అసెంబ్లీ వేదికగా ప్రజల్లోకి బాగా వెళ్లాలని చంద్రబాబు తేల్చి చెప్పారు. సందర్భాన్ని బట్టి తానూ, పవన్ కల్యాణ్ చర్చల్లో పాల్గొంటామని స్పష్టం చేశారు. శాఖల వారీ పద్దులపై జరిగే చర్చల్లో మంత్రులు బాగా ప్రిపేర్ అయి మాట్లాడాలని సీఎం తెలిపారు. మంత్రి సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు అనుబంధంగా మాట్లాడేవారూ కంటెంట్ ప్రిపేర్ అయ్యేలా చూడాలని సూచించారు.

