ISRO 4,000 కిలోల కంటే ఎక్కువ బరువున్న కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03ని ప్రయోగించింది. ఈ ఉపగ్రహం భారత్ భూస్థిర బదిలీ కక్ష్య (GTO)లోకి ప్రవేశపెట్టే అత్యంత భారీ ఉపగ్రహం అని అంతరిక్ష సంస్థ ఇస్రో తెలిపింది. 4,000 కిలోల వరకు బరువును మోసుకెళ్లే సామర్థ్యం కారణంగా శాటిలైట్ లాంచింగ్ వెహికల్‌కు ‘బాహుబలి’ అని పేరు పెట్టారు. ప్రయోగించిన రాకెట్ విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టినట్లుగా ఇస్రో ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రయోగం విజయవంతం అవడంపై ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ శాస్త్రవేత్తలను అభినందించారు.

